తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది హీరోయిన్ నివేదా పేతురాజ్. అచ్చమైన అరవ అమ్మాయి నివేదా. కాని తమిళనాట ఎక్కువగా రాణించలేకపోయింది. తమిళనాడులో పుట్టి తమిళం బాగా మాట్లాడేవారికి తెలుగు మాదిరి అవకాశాలు ఇవ్వడంలేదనే విమర్శ ఉంది. ఈ విషయంలో బెస్ట్ ఎక్జాంపుల్ నివేదా పేతురాజ్. మదురైలో పుట్టిపెరిగిన ఆమె తమిళ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోని,విజయ్ సేతుపతి లాంటి హీరోల సరసన మెరిసింది బ్యూటీ. ఆతరువాత తమిళంలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. కోలీవుడ్ ను అందింపుచ్చుకుంది బ్యూటీ. తెలుగులో వరుసగా అవకాశాలు.. వరుసగా విజయాలు ఆమెను వరించాయి. టాలీవుడ్ లో అల్లు అర్జున్తో అలవైకుంఠపురములు, రెడ్ వంటి వరుస హిట్లను అందించిన నివేదా పేతురాజ్ టాలీవుడ్లో పాపులర్ నటిగా మారింది. కాని ఇక్కడ కూడా ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో వెబ్ సిరీస్ ల వైపు మళ్లింది బ్యూటీ. రీసెంట్ గా పరుపు అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది నివేదా పేతురాజ్. ఈ సిరిస్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తెలుగులో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్లో జోరుగా పాల్గొంది నివేదా. ఇక ఇందులో భాగంగా నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఇది సినిమా ప్రమోషన్ కోసంమని తర్వాత తెలిసి అంతా షాక్ అయ్యారు కూడా. ఈక్రమంలో పరుపు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చిన నివేదా.. ఓ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మరీముఖ్యంగా తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్టు తన కోరిక గురించి కూడా మాట్లాడాడు. ఇంతకీ నివేదా ఈవిషయంలో ఏం కామెంట్స్ చేశారంటే..? నివేదా మాట్లాడుతూ.. "నాకు ప్లం లిప్స్ అంటే చాలా ఇష్టం.. నా పెదాలు కూడా అలా మార్చుకోవాలని ప్రయత్నం చేశారు. దాని కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నాను. ఈ విషయం మా ఫ్యామిలీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాను.. ఇంజెక్షన్ తీసుకుంటావా అని అడిగారు. సరే అన్నాను.. అయితే నిన్ను చంపేస్తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని డాక్టర్ సరదాగా బెదిరించాడు. ఇలాంటివి మంచిది కాదని.. ఫ్యూచర్ లో చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.