లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కూలీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. జల్లికట్టు, విక్రమ్ మరియు సర్కార్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలలో పనిచేసినందుకు పేరుగాంచిన గిరీష్ గంగాధరన్ రజనీకాంత్ కూలీకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తారని ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ జూలై నెలలో జరగాల్సి ఉంది. ఈ చిత్రం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.