పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన కల్కి 2898 AD విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ప్రఖ్యాత ట్యూన్స్‌మిత్ సంతోష్ నారాయణన్ సినిమా ఆడియో జ్యూక్‌బాక్స్ మరియు OST (ఒరిజినల్ సౌండ్‌ట్రాక్) గురించి ఉత్తేజకరమైన అప్‌డేట్‌తో అభిమానులను థ్రిల్ చేసాడు. తన ఇటీవలి పోస్ట్‌లో అధికారిక ఆల్బమ్ మరియు స్కోర్ ఊహించిన దాని కంటే చాలా త్వరగా విడుదల చేయబడుతుందని ఇందులో భారీ 25 ట్రాక్‌లు ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రకటన అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ లో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటానీ, శాశ్వత ఛటర్జీ, బ్రహ్మానందం, అన్నా బెన్, శోభన, మృణాల్ ఠాకూర్, దుల్కుర్ సాల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa