మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపిని తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ టీం హైదరాబాద్‌లో పలు భారీ సెట్లను నిర్మించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విస్తృతమైన సెట్లలో ఒకదానిపై షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ 100-120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా కనిపించనుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.