హిందుస్తానీ 2 (ఇండియన్ 2 హిందీ వెర్షన్) ప్రమోషన్‌ల సమయంలో శంకర్‌ని శివాజీ, నాయక్ (ముధల్వన్ హిందీ వెర్షన్), మరియు అపరిచిత్ (అన్నియన్ హిందీ వెర్షన్) వంటి చిత్రాలకు సీక్వెల్ చేయడానికి ప్లాన్ ఉందా అని అడిగారు. శంకర్ మాట్లాడుతూ... నా సినిమాలు సామాన్యుల దృష్టికోణంలో ఉంటాయి. ఒక సినిమా దేశం మొత్తానికి కనెక్ట్ అయితే అది పాన్ ఇండియా చిత్రం అవుతుంది. ప్రేక్షకులు నేను శివాజీ 2, నాయక్ 2, మరియు అపరిచిత్ 2 చేయాలని కోరుకుంటారు. కానీ సీక్వెల్ చేయడం కోసమే నేను చేయను. సబ్జెక్ట్ నన్ను కొట్టాలి. అది జరిగితే నేను చేస్తాను అని అన్నారు. ప్రస్తుతం సీక్వెల్స్ ఆలోచన లేదని శంకర్ స్పష్టం చేశారు. ఇండియన్ 2 విడుదలైన తర్వాత శంకర్ తన దృష్టిని పూర్తిగా రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ వైపు మళ్లించనున్నాడు. ఈ సినిమా 10-15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి.