సూపర్ స్టార్ రజనీకాంత్, మంచు మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. 45ఏళ్ల పైగా మొదలై నేటికీ అదే రీతిలో కొనసాగుతోంది వీరి స్నేహం. అయితే, తాజాగా వీరిద్దరూ విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను మోహన్ బాబు Xలో పోస్ట్ చేశారు. దానికి ‘అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో చూసిన వారంతా ‘కన్నప్ప’లో రజనీకాంత్ ఉన్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.