శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్` షోతో పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో ముందుకు రావడం విశేషం. ఏమీ లేని స్థితి నుంచి వరుసగా నాలుగైదు షోస్ చేసే స్థాయికి ఎదిగింది. అంతగా కష్టపడింది. తన టాలెంట్‌కి పని చెప్పి షోలని రక్తికట్టించింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. `సరిగమప`, `కామెడీ స్టార్స్`, `సారంగదరియా`, `మిస్టర్ అండ్ మిసెస్`, `నీతోనే డాన్స్`, `ఆదివారం స్టార్ మాపరివార్`, `బిబీ జోడీ` వంటి షోస్‌కి యాంకర్‌గా చేసింది. వీటితోపాటు పండగలకు ప్రత్యేక ఈవెంట్లకి తనే బెస్ట్ ఆప్షన్. ఈటీవీ, స్టార్ మా, జెమినీ, జీ తెలుగు ఇలా ఏ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అయినా, శ్రీముఖి ఉండాల్సిందే అనేట్టుగా మారిపోయింది. ఆయా షోస్ జనాలను బాగా ఆదరణ పొందడంతో శ్రీముఖికి డిమాండ్ పెరిగింది. ఒక్కో షో పెంచుకుంటూ వస్తుంది శ్రీముఖి. డామినేటింగ్ యాటిట్యూడ్, చలాకీతనం, సెటైర్లని స్పోర్టీవ్‌గా తీసుకోవడం, పులిహోర కలపడం ఇలా ఏదైనా చేయగలదు ఈ బుల్లితెర రాములమ్మ. అందుకే బాగా సక్సెస్ అయ్యింది.పైగా అందానికి అందం. ఇవన్నీ తోడు కావడంతో ఆమె యాంకరింగ్ చేసిన షోస్ బాగా రక్తికడుతున్నాయి. మంచి రేటింగ్ వస్తున్నాయి. ఇలా శ్రీముఖికి డిమాండ్ పెరుగుతుంది. అన్ని విషయాల్లో కంఫర్ట్ గా ఉండటం అనేది ఆమెకి బాగా ప్లస్ అయ్యింది. అదే ఆమెని స్టార్ యాంకర్ని చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుస్టార్ యాంకర్ శ్రీముఖి గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె డిఫరెంట్ పోజులతో కనువిందు చేస్తుంది. ప్రతి వారం తన షోస్ కోసం ఆమె ఫోటో షూట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తుంది. వారికి విజువల్ ట్రీట్ ఇస్తుంది. తీరైన ట్రెండీ వేర్స్ ధరించి పోజులివ్వగా అవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతుంది. టాప్ డిజైనింగ్‌తో కూడా బ్లాక్ ఫ్రాక్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ బ్లాక్ ఫ్రాక్‌లో శ్రీముఖి అందం రెట్టింపు కావడం విశేషం.