డార్క్ కామెడీ పేరుతో యూట్యుబర్ ప్రణీత్ హనుమంతు, అతని స్నేహితులు కలిసి ఓ తండ్రీ కూతురు వీడియో విషయంలో చేసిన కామెంట్స్ విషయంలో తొలుత సాయిధరమ్ తేజ్ మండిపడుతూ ఓ పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పోలీస్ డిపార్ట్మెంట్ను కోరారు. ఈ ఘటనపై మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్, అహితేజ బెల్లంకొండ కూడా స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.