లావణ్య ఫిర్యాదుతో హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు BNSS 45 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 2008 నుంచి రాజ్ తరుణ్‌తో పరిచయం ఉందని, 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చానని, 2016లో గర్భం దాలిస్తే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో లావణ్య పేర్కొంది.