మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని త్వరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.