నటుడు సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బనవనూరుకు చెందిన దేవికుమారీ చదువుకు కావాల్సిన సాయం చేశారు. ’నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం చేశారు. ఆయన నాకు దేవుడితో సమానం’’ అని దేవి ఆనందం వ్యక్తం చేసింది. సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేసింది. ’మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ‘ అని సోనూ ’ఎక్స్‘లో పోస్ట్ చేశారు.