నిహారిక కొణిదెల తన తొలి చలన చిత్రానికి 'కమిటీ కుర్రోళ్లు' అనే టైటిల్ ని లాక్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆగష్టు 9న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంతో యధు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు అడ్డగళ్ల ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa