ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. లాయక్ రామ్ నేగి లోక్సభ ఎన్నికల్లో కంగనా పోటీ చేసిన మండీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నాడు. మండీ డిప్యూటీ కమిషనర్ తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని.. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయాలేకపోయానని నేగి తన పిటిషన్లో పేర్కొన్నారు.