ముంబయి: యశ్ (Yash) హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic). భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో తాను భాగమైనట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్ నటి తారా సుతారియా స్పందించారు.ఆయా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ''ఓ ప్రాజెక్ట్‌లో నేను భాగమయ్యానంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తవం లేదు. ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని నేను ఎక్కడా చెప్పలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీ అందరితో పంచుకుంటా. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా. ప్లీజ్ నోట్: ఎవరూ ఎవరికీ రెండో మనిషి కాలేరు'' అని ఆమె రాసుకొచ్చారు.