ప్రముఖ నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ బావ, మహేష్ బాబు మామ ఉప్పలపాటి సూర్య నారాయణ కన్నుముశాడు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.సూర్యనారాయణ బాబు కృష్ణా జిల్లాలోని రిమ్మనపూడి అనే గ్రామంలో జన్మించారు.సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి సినిమాలు చేసిన సూర్యనారాయణ మహేష్ బాబు, రమేశ్ బాబులతో ‘బజారు రౌడీ’ సినిమాను నిర్మించారు. నిర్మాతగా ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీలో భాషల్లో 24 సినిమాలను నిర్మించాడు