నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా వీడియో గ్లింప్సె కి మంచి స్పందన లభించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ని మూవీ మేకర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కి చిత్ర బృందం 8 కోట్ల బడ్జెట్ తో బ్రహ్మకడలి సెట్ ని నిర్మించి 1000 మంది ఆర్టిస్ట్ తో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ప్రముఖ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనుంది. ముప్పా వెంకయ్య చౌదరి, అశోక్ వర్ధన్ ముప్పా, మరియు సునీల్ బలుసు సమర్పణలో, అజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చారు.