ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమరన్‌' కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 04:49 PM

కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని రాజ్‌కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'అమరన్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో అమరన్ కోసం అధికారికంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఈ విషయాన్ని నటి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సహకారంతో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన అమరన్ దేశభక్తి చిత్రం. ఈ సినిమా అక్టోబరు 31, 2024న గ్రాండ్ మల్టీ-లాంగ్వేజ్ విడుదలకు సిద్ధంగా ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com