హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. తాజగా ఇప్పుడు ప్రముఖ యాంకర్ సుమతో చిత్ర బృందం స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. త్వరలో ఈ ఇంటర్వ్యూ విడుదల కానుంది. ఈ చిత్రం అజయ్ దేవగన్ యొక్క సూపర్ హిట్ రైడ్ యొక్క అధికారిక రీమేక్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుంది. ఈ చిత్రం నిజాయితీ గల ఆదాయపు పన్ను అధికారి మిస్టర్ బచ్చన్ గురించి. ఈ చిత్రం పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై భారతదేశం యొక్క సుదీర్ఘ ఆదాయపు పన్ను దాడి ఆధారంగా రూపొందించబడింది. టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.