2014లో ‘మేరీ ఆశికీ తుమ్ సే హీ’ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్.. ‘సిర్ఫ్ రా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, తాజాగా అందం, ప్లాస్టిక్ సర్జరీలపై ఇటీవల రాధిక చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో హీరోయిన్గా స్థిరపడాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందం కూడా ఉండాలి. భవిష్యత్తులో మరింత అందంగా కనిపించడానికి సర్జరీల గురించి నేను కూడా ఆలోచించే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చింది రాధికా మదన్.