ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 10:59 AM

సినిమా ఇండస్ట్రీలో పెళ్లికి ముందు డేటింగ్ చేయడం అనేది చాలా కామన్.కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు డబ్బున్న చాలా మంది ఇలా పెళ్లికి ముందే డేటింగ్స్ చేస్తూ ఉంటారు.అయితే సామాన్య జనాలు కూడా చేస్తూ ఉంటారు.కానీ బయటపడరు. కానీ సామాన్య జనాలు పెళ్లికి ముందు అలాంటి చెడు తిరుగుళ్ళు తిరగకూడదు అని అంటారు.వారికి కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు వంటివి ఉంటాయి. కానీ ఈ జనరేషన్ అలా ఏమీ లేదు.


ఎవరికి నచ్చిన వారితో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఓ నటి పెళ్లికి ముందే డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయిందట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించింది. ఆమె ఎవరో కాదు అమలాపాల్.. హీరోయిన్ అమలాపాల్ పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేయడంతో చాలామంది పెళ్లికి ముందే తల్లయిందని భావించారు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమలపాల్ చెబుతూ.. నేను పెళ్లికి ముందు తల్లినైన మాట నిజమే. అయితే నా మొదటి పెళ్లి చెడిపోయిన సమయంలో నేను ఎంతగానో డిప్రెషన్ లోకి వెళ్లాను.అంతే కాదు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అని కఠిన నిర్ణయం తీసుకున్నాను.కానీ నా భర్త మాత్రం ఆ నిర్ణయం నుండి నన్ను బయట పడేసాడు. ఆ ఆలోచనలే రాకుండా వాటి నుండి నన్ను దూరం చేశాడు. నా అభిరుచులకు ప్రాధాన్యత నిస్తూ నన్ను బాగా చూసుకున్నాడు.దాంతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగింది. అయితే మేమిద్దరం డేటింగ్ చేసిన వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నాను. అంటూ అమలాపాల్ పెళ్లికి ముందే తల్లవ్వడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక జగత్ దేశాయ్ అమలాపాల్ కి రీసెంట్ గానే ఇలై అనే ఒక బాబు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. అమలాపాల్ తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్, బెజవాడ, జెండాపై కపిరాజు, ఎస్ఎంఎస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com