టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , రానా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే..అంతే కాదు వీళ్లిద్దరు క్లాస్ మెంట్స్ కూడా, ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో.. ఒకే క్లాస్ చదివారు. ఇక వీరు ఇద్దరు క్లాస్ మేట్స్ అనే విషయం చాలామంది ఫ్యాన్స్ కు ముందే తెలుసు. ఇక చాలా సందర్భాల్లో వీరిద్దరు తమ స్నేహం గురించి.. తాము చేసిన తుంటరి పనుల గురించి చెప్పుకున్నారు. వీరితో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా వీరి బ్యాచ్ లో ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిద్దురు సరదాగా ర్యాగింగ్ చేసుకుంటూ.. టీజ్ చేసుకున్నారు కూడా. తమ స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటూ.. ఒకరి సీక్రేట్ మరొకరు వెల్లడించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో రానా గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానా వల్ల తన చదువుకు కలిగిన ఇబ్బందులు గురించి చరణ్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంతకీ రానా గురించి చరణ్ ఏమన్నాడో తెలుసా..? రానా వల్ల చరణ్ కు చాలా తక్కువ మార్కులు వచ్చాయట. రామ్ చరణ్ మాట్లాడుతూ 8క్లాస్ నుంచి నుంచి నేను రానా కలిసి చదువుకున్నాము.. అయితే అప్పటి వరకూ నాకు బాగానే మార్కులు వచ్చేవి కాని.. ఆతరువాత మార్కులు తగ్గాయి. అయితే అన్ని మార్కులు తగ్గడానికి రానానే కారణం అన్నారు చరణ్. నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డ్ ఏం కనిపిస్తుందని అని చెప్పేవాడినని చరణ్ అన్నారు.అంతే కాదు రానా నా క్యారేజ్ కూడా తినేవాడు. నాదే కాదు..ఫ్రెండ్స్ లో చాలామంది క్యారేజ్ ను కూడా రానా తినేసేవాడు. అన్నారు చరణ్. కాని రానా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి.. ఆయన.. నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.