హీరో నాని వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దసరా నాని కెరీర్ హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది.నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. హాయ్ నాన్న మూవీతో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద స్లోగా పుంజుకున్న హాయ్ నాన్న, బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది.నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టు 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ వచ్చింది. ఈ మూవీ ఫలితం నిరాశపరిచింది. అయితే వివేక్ ఆత్రేయ టాలెంట్ పై నమ్మకంతో నాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో మహేష్ బాబుపై నాని కీలక కామెంట్స్ చేశాడు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో నాని పాల్గొన్నాడు. మహేష్ బాబు వంటి హీరో ఓ పర్ఫెక్ట్ ఫిల్మ్ తో పాన్ ఇండియా డెబ్యూ ఇవ్వాలని ఎదురు చూశారు. రాజమౌళితో చేయబోతున్న చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. కానీ నాని మాత్రం ప్రతి సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు? ఎవరి స్ట్రాటజీ కరెక్ట్? అని హీరో నానిని యాంకర్ అడిగాడు.
ఈ ప్రశ్నకు సమాధానంగా నాని… మహేష్ బాబు వస్తూనే సూపర్ స్టార్. ఆయన జర్నీ వేరు. ఒక పర్ఫెక్ట్ భారీ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆయన ఆలోచన కరెక్ట్. అదే సమయంలో నా స్ట్రాటజీ కూడా కరెక్ట్. ఎందుకంటే నా జర్నీ వేరు. నేను సినిమా సినిమాకు నా ఆడియన్స్ ని పెంచుకుంటూ పోవాలని అనుకుంటున్నాను. ఇతర భాషలే కాదు, తెలుగులో కూడా నేను అదే చేశాను.
నేను హీరోగా వచ్చినప్పుడు నాని ఎవరో ఆడియన్స్ కి తెలియదు. మహేష్ బాబుకి ఆల్రెడీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ నాకు లేదు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ లో కూడా నేను ఒక్కో సినిమాతో నా ఆడియన్స్ సంఖ్య పెంచుకుంటూ పోవాలి అనుకుంటున్నాను. కాబట్టి మహేష్ బాబుకు ఆయన స్ట్రాటజీ కరెక్ట్ అయితే, నాకు ఈ విధానం సూట్ అవుతుందని నేను భావిస్తున్నాను, అన్నారు. నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.