ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కన్నప్ప' లోని అవ్రం మంచు ఫస్ట్ విడుదల ఎప్పుడంటే...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 08:38 PM

విష్ణు మంచు నటిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పురాణ కథాంశం నుండి అవ్రం మంచు ఫస్ట్ లుక్ పోస్టర్ ని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆగస్ట్ 26న  విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో విష్ణు మంచుతో కలిసి బ్రహ్మగా మోహన్ లాల్, నందిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ మరియు పార్వతిగా కాజల్ అగర్వాల్ ఉన్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, ముఖేష్ రిషి, శరత్‌కుమార్, బ్రహ్మానందం, రఘుబాబు, మధు, ఐశ్వర్య భాస్కరన్, ప్రీతి ముకుందన్, సప్తగిరి, సంపత్, దేవరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa