కన్నడ సినీ హీరో దర్శన్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడించింది. సెప్టెంబర్ 9 వరకు కస్టడీ పొడిగిస్తూ బెంగళూరు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా జైలులో దర్శన్‌కు కాఫీ, సిగరెట్లు అందుతుండడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకి నటుడు దర్శన్‌ను మార్చింది.