ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వెట్టయన్‌' కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన మంజు వారియర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 05:18 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫహద్ ఫాసిల్, రితికా సింగ్, దుషార విజయన్ మరియు అభిరామి తమ డబ్బింగ్ పూర్తి చేసారు. త్వరలో ఈ సినిమా ప్రొమోషన్స్ ని మూవీ మేకర్స్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. ఇటీవలి మలయాళ చిత్రం ఫుటేజ్‌తో పేరుగాంచిన మంజు వారియర్, రజనీకాంత్‌తో కలిసి వెట్టయాన్‌లో స్క్రీన్‌ను పంచుకోనున్నారు. తాజాగా నటి మంజు వారియర్ వేట్టైయన్ కోసం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com