గతంలో ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్ లో ఉండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నోరు జారానని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. తప్పు చేశానని అనిపించిందని... ఆ తర్వాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. ఆయనకు క్షమాపణ చెపుతున్నానని అన్నారు. 'తీన్ మార్' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నానని... కానీ, చిన్నిచిన్ని సమస్యల వల్ల అది మిస్ ఫైర్ అయిందని చెప్పారు. ఈ చిత్రాన్ని మళ్లీ అద్భుతంగా చేసి రీరిలీజ్ చేస్తానని తెలిపారు.