ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాహిద్‌-కైరా లిప్‌లాక్‌పై నెటిజ‌న్ల చ‌ర్చ‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2019, 06:46 PM

జూన్ 21న క‌బీర్‌సింగ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే కబీర్ సింగ్ టీమ్ జోరుగా ప్రచారం అద‌ర‌గొట్టేస్తుంది. ఆ క్రమంలోనే ఎప్పటికప్పుడు పోస్టర్లు- టీజర్లు అంటూ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. ప్రస్తుతం కబీర్ సింగ్ టైటిల్ పాత్ర ధారి షాహిద్ కపూర్ ఓవైపు.. ప్రీతి పాత్రధారి కైరా అద్వాణీ మరోవైపు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఏ రేంజులోవ వర్కవుటైందో చూపే ఓ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు. కబీర్ – ప్రీతి జంట ప్రేమకు ఆహ్వానం పంపిస్తున్నారు అంటూ ఈ పోస్టర్ ని రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్ వచ్చిన క్షణాల్లోనే దీనిపై షాహిద్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ డిబేట్ నడిపిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఇది అర్జున్ రెడ్డి పోస్టర్ కి సేమ్ టు సేమ్ కాపీలా ఉందని విమర్శించారు. బాలీవుడ్ ఈరోజుల్లో అంతా కాపీనే అంటూ ఈ ముద్దుపై అభిమానుల్లో ఆసక్తికర డిబేట్ సాగుతోంది. అయితే తెలుగు వెర్షన్ తెరకెక్కించిన సందీప్ రెడ్డినే హిందీ లోనూ డైరెక్ట్ చేసినప్పుడు కాపీ ఎలా అవుతుంది అంటూ వేరొక అభిమాని తిరిగి కౌంటర్ వేశారు. మొత్తానికి `కబీర్ సింగ్`కి కావాల్సినంత ప్రచారం సాగుతోంది. నెటిజనులు ప్రస్తుతం ఈ పోస్టర్ ని జోరుగా వైరల్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa