శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను అద్భుతమైన పోస్టర్‌తో ప్రకటించారు. ట్రైలర్ సెప్టెంబర్ 10, 2024న విడుదల కానుంది మరియు దానిని ఆవిష్కరించడానికి ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయబడింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ హాజరుకానున్నారు. దీంతో పాటు ట్రైలర్‌ను విడుదల చేసేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.