ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' షూటింగుతో బిజీగా వున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.
'కేజీఎఫ్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ బ్యానర్లో ఒక తెలుగు సినిమా చేసిపెట్టమని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆయనని ఒప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa