శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం దేవరపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ఉన్న ఈ సినిమా ఇటీవల విడుదలైన దాని థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. భయంకరమైన లార్డ్ ఆఫ్ ఫియర్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు, జాన్వీ కపూర్‌తో పాటు, ఈ ఎపిక్ సాగా యాక్షన్ డ్రామా మరియు దృశ్యమాన దృశ్యాల థ్రిల్లింగ్ సమ్మేళనానికి హామీ ఇస్తుంది. అద్భుతమైన విజువల్స్, డైనమిక్ స్కోర్ మరియు మరపురాని యాక్షన్ సీక్వెన్స్‌లతో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షించే సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది. ఎన్టీఆర్ షార్క్‌పై స్వారీ చేసే చివరి షాట్ ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 55 మిలియన్ వ్యూస్ తో గ్లోబల్ వైడ్ గా ట్రేండింగ్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.