జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ వ్యవహారంలో కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ అయింది. ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయగా, తాజాగా రేపు (మంగళవారం రోజున) కొరియోగ్రాఫర్ అసోషియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఆసోషియేషన్‌కు జానీ మాస్టర్ ప్రెసిడెంట్‌గా ఉండగా సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతోఈ సమావేశం రేపటికి వాయిదా పడింది. రేపు ఈ సమావేశంలో జానీ మాస్టర్ పై అసోసియేషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇదిలాఉండగా యూనియన్ బై లాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.