బాలీవుడ్ నటి అలియా భట్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో తొలిసారి హొయలొలికించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్లో మెటాలిక్ డ్రెస్‌లో రన్‌వేపై స్టైల్‌గా నడిచారు.ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తొలిసారి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడంపై అలియా మాట్లాడుతూ.. ఐశ్వర్యారాయ్ తనకు స్ఫూర్తి అన్నారు.'తన అందంతో ఈ వేదికకు మరింత కళ తెచ్చిన ఐశ్వర్యరాయ్ నాకు స్ఫూర్తి. సినిమాల్లోనూ ఆమె డ్యాన్స్ చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ఇప్పటికీ ఎంతోమందిని మంత్రముగ్దులను చేస్తోంది. యూట్యూబ్‌లో 'ఐశ్వర్యారాయ్ పాటలు' అని సెర్చ్ చేసుకొని చూస్తుంటాను. తన డ్యాన్స్ మూమెంట్స్ అంటే నాకు అంత ఇష్టం' అని చెప్పారు. ఇక ఏ వేడుకలో అయినా విభిన్న కాస్ట్యూమ్స్‌తో కనిపించి ఆకట్టుకునే ఐశ్వర్య ఈ ఫ్యాషన్ వీక్‌లో రెడ్ కలర్ డ్రెస్‌లో మరోసారి ఆకర్షించారు. రెడ్ కలర్ ఫుల్ డ్రెస్‌లో తళుక్కున మెరిసి తన లుక్‌తో ట్రెండ్ సెట్ చేస్తారు.