సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పంపిణీ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ఆగస్ట్ 23న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ OTT రైట్స్ ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024 నుండి జీ5లో తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ పిల్టఫార్మ్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.