సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో తమన్నా భాటియా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ ల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా..ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తుంది. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతుంది. ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. అయితే కొన్ని నెలలుగా తమన్నా పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కనుంది.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ చాటపట్టాలేసుకు తిరుగుతూ చాలా సార్లు మీడియా కంటపడ్డారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఇదిలా ఉంటే తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ల్లో రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై తమన్నా ఓపెన్ గా మాట్లాడింది. చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బందిపడతారు. అలాగే మరికొంతమంది మాత్రం అవలీలగా నటించి మెప్పిస్తారు.
ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తున్నారు. తాజాగా రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. రొమాంటిక్ అలాగే శృంగార సన్నివేశాల్లో నటించడానికి చాలామంది ఇష్టపడరు .. కానీ ఆ సీన్స్ కు అవసరం కాబట్టి తప్పక నటిస్తారు అని చెప్పుకొచ్చింది తమన్నా. అలాగే శుంగారపు సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎక్కడ కో స్టార్‌కు ఇబ్బంది అవుతుందో అనే ఉద్దేశ్యంతో చాలా హీరోలు కూడా ఇబ్బంది పడుతారు.. అసౌకర్యంగా ఫీల్ అవుతారు అని.. ఆ సీన్స్ చేసేప్పుడు నటి ఎలా ఫీల్ అవుతుందో అనే ప్రశ్నలు వారిలో ఉంటాయని తమన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది.