‘కళ్యాణం కమనీయం’తో తెలుగు సినీ ఇండస్ట్రీకి నటి ప్రియా భవానీ శంకర్ పరిచయమయ్యారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తదుపరి సినిమా ‘బ్లాక్’ ను ఉద్దేశించి మాట్లాడారు. గ్లామర్ రోల్స్ పోషించడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదు, ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదని అన్నారు.