కోలీవుడ్ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌పై దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆరోపణలు చేశారు. 'లింగ’ సినిమా ఎడింటింగ్‌లో రజనీ జోక్యం చేసుకున్నారనీ, చాలా మార్పులు చేశారని ఆయన ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ లింగ ఎడిటింగ్ విషయంలో రజనీ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ కోసం నాకు అసలు సమయం ఇవ్వలేదు. ద్వితీయార్థం మొత్తం మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారు. లింగ సినిమాను గందరగోళం చేశారు’’అని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు.
మంచి దర్శకుడనే గుర్తింపు ఆయనకు ఉంది. గతంలో రజనీకాంత్‌తో ముత్తు, నరసింహ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశారు. కొంత గ్యాప్ తర్వాత 2014లో వీరిద్దరి కాంబోలో లింగ చిత్రం వచ్చింది. రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేయగా, అనుష్క, సోనాక్షి సిన్ణ నాయికలుగా నటించారు. అప్పట్లో దాదాపు రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం పాలైంది. 2016లో ఇదే సినిమా గురించి రవికుమార్ మాట్లాడుతూ వరల్డ్ వైడ్ మా సినిమా 150 కోట్లు వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. కలెక్షన్ల పరంగా సినిమా సూపర్‌హిట్ అని అన్నారు. ఇప్పుడేమో 'లింగ' పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారు రవికుమార్.