ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్స్ జాబితా చాలా పెద్దదే. ఒక్కో సందర్భంలో ఒక్కో హీరోయిన్ పేరును డార్లింగ్ చెప్పుకొచ్చాడు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ భామల వరకు ఉన్నారు. త్రిష, శ్రీయ, నయనతార, అనుష్క, సాయిపల్లవి, దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అలియా బట్.. ఉన్నారు. ఇంతమంది ఫెవరేట్ లిస్ట్ ఉన్నా.. మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుకుంది మాత్రం ‘సౌత్ ఇండియన్ క్వీన్’ త్రిషతోనే. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రిషతో నటించడం తనకు చాలా కన్వీనెంట్‌గా అనిపిస్తుందని తెలిపాడు. ఏ సీన్ అయినా సరే ఓకే షాట్లో పూర్తి చేస్తారట.ప్రభాస్‌తో కలిసి త్రిష మూడు సినిమాల్లో యాక్ట్ చేసింది. 2004లో వచ్చిన వర్షం సినిమాతో తొలిసారిగా జత కట్టారు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. పౌర్ణమి మూవీలో కూడా వీరి కెమిస్ట్రీ బాగుంటుంది. బుజ్జిగాడులో ప్రభాస్-త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీగా ఉంటాయి. బుజ్జిగాడు అనంతరం వీరిద్దరూ కలిసి నటించలేదు. మరోసారి ఈ కాంబో ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.