టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ దీపావళి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. దీపావళి లాంగ్ వీకెండ్ రావడంతో 4 రోజుల్లో రూ.11.89 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. కాగా ఈ మూవీ త్వరలోనే తమిళంలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa