టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి మెయిన్ లీడ్‌లో నటిస్తున్న ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, క్రిష్ పర్సనల్ లైఫ్ గురించి గతకొద్ది రోజులుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇప్పుడు ఈ వార్త నిజం అయ్యింది.హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను దర్శకుడు క్రిష్ నేడు వివాహం చేసుకున్నాడు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు క్రిష్ పెళ్లి వార్త విని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
ఎవరు ఈ ప్రీతి చల్లా?
గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రీతి 2007 నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ను ఆమె పూర్తి చేశారు. అక్కడే గైనకాలజీలో ఎంఎస్ కూడా పూర్తి చేశారు.గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన కుటుంబ వ్యాపారమైన చల్లా ఆసుపత్రినిలో వైద్యురాలిగా చేరి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా క్రిష్ ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ.. వధువు వివరాల్ని మాత్రం క్రిష్ గోప్యంగా ఉంచారు.