టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ ఒకవైపు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలోను ముందుంటుంది. తాజాగా అనన్య నాగళ్ళ అర్ధరాత్రి పూట.. హైదరాబాద్ బస్టాండ్ వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది. చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అనన్యను మరోసారి అంతా అభినందిస్తున్నారు.ఇటీవల ఏపీలో వరదలు వచ్చిన సమయంలో కూడా ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది. ఇక అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవలే పొట్టెల్ సినిమాలో ఓ రా & రస్టిక్ క్యారెక్టర్ చేసి మెప్పించింది అనన్య.