బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సినీరంగంలో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఆమె.. ప్రేమలో మాత్రం చాలాసార్లు మోసపోయింది. నిజానికి ఆమె ఫ్రెంచ్ కు చెందిన నటి.కానీ బీటౌన్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లికి ముందే చాలా మందిని ప్రేమించి డేటింగ్ చేశానని స్వయంగా తనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనే బీటౌన్ నటి కల్చి కోచ్లిన్. ఆమె ఫ్రెంచ్ నటి. కానీ హిందీలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ లతో కాకుండా నిత్యం వ్యక్తిగత జీవితం గురించే వార్తలలో నిలిచింది. గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ వంటి లను రూపొందించిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో ప్రేమలో పడింది. అనురాగ్ కశ్యప్ చిత్రం దేవ్ డి కోసం ఆడిషన్ కు వచ్చిన కల్కి కోచ్లిన్.. అదే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.కల్కి కంటే అనురాగ్ 14 ఏళ్లు పెద్దవాడు. 2011లో ఊటీలో అనురాగ్ కశ్యప్, కల్కి కోచ్లిన్ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన రెండేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చివరికి వారిద్దరూ 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కల్కి పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. సెప్టెంబర్ 30, 2019న, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గై హెర్ష్‌బర్గ్‌తో గర్భం దాల్చినట్లు ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 7న వీరికి పాప జన్మించింది.అయితే అప్పట్లో కల్కి పై చాలా విమర్శలు వచ్చాయి. పెళ్లి కాకుండానే తల్లి కావడంపై కల్కిని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి.. తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తన బాయ్ ఫ్రెండ్ గై హెర్ష్ బర్గ్ ను వివాహం చేసుకుంది. చిన్నవయసులోనే తాను ఎంతో మందితో డేటింగ్ చేశానని.. అదే సమయంలో బహుళ సంబంధాలను నిర్వహించే వ్యక్తులను చూశానని చెప్పుకొచ్చింది.