టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల తో ఏడడుగులు వేయబోతున్నాడు.డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు వెల్లడించారు.
నాగచైతన్య – శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదని.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమన్నారు. ఈ స్టూడియోస్ తన నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. చై కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన అందమైన సెట్లో చై-శోభిత ఒక్కటి కాబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్లు వివరించారు. పెళ్లి తర్వాత రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నాగార్జున స్పష్టం చేశారు.