సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశాపటానికి సంబందించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వచ్చారు. పలు కార్యక్రమాలకు సైతం జంటగా వచ్చి ఎన్నోసార్లు మీడియాకు చిక్కారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరి ప్రేమాయణానికి బ్రేక్ పడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలు నిజమే అని బాలీవుడ్ మీడియా చెబుతోంది. లోఫర్ బ్యూటీ దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ జోడీ ఇకపై లవ్ బర్డ్స్ లా కాకుండా స్నేహితులుగా ఉండనున్నారని తెలుస్తోంది. నిజానికి పెళ్లి చేసుకొని ఒక్కటవుదామని నిర్ణయించుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డు చెప్పిందని సమాచారం. ఈ మేరకు తమ రిలేషన్ షిప్ విషయంలో పూర్తి క్లారిటీకి వచ్చేశారట దిశా పటానీ- టైగర్ ష్రాఫ్. తామిద్దరం బ్రేకప్ తీసుకోబోతున్నాం అని వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇకపై స్నేహితులుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసిందట ఈ జోడీ. ఈ విషయాన్ని వారిద్దరి సన్నిహితులు లీక్ చేశారు.
నిజానికి తామిద్దరం డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని ఇదివరకెప్పుడూ స్వయంగా ప్రకటించలేదు ఈ జోడీ. కానీ పలు ఈవెంట్స్ లో చెట్టాపట్టాలేసుకు తిరగడంతో ఈ ఎఫైర్ బయటపడింది. అదేవిధంగా దిశా గానీ, టైగర్ గానీ తమ మధ్య ఎఫైర్ నడుస్తుందని వస్తున్న వార్తలు ఖండించిన సందర్భాలు లేవు. మేం కేవలం స్నేహితులు మాత్రమే అంటూ ఇంతకాలం ప్రేమాయణాన్ని సాగించిన ఈ ఇద్దరూ ఇకపై నిజంగానే స్నేహితులుగా మారబోతున్నారట. అయినా బాలీవుడ్ హీరోహీరోయిన్లకు ఇవన్నీ కామనే లెండి! ప్రస్తుతం దిశా పటాని, టైగర్ ష్రాఫ్ తమ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'భారత్' మూవీ ద్వారా అలరించింది దిశా పటాని.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa