ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహర్షి 50 డేస్ ఫంక్షన్ కి గెస్ట్ గా నాని ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2019, 12:28 PM

మహేశ్ బాబు కథానాయకుడిగా .. ఆయన 25వ సినిమాగా 'మహర్షి' తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే నటించింది. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ, ఈ నెల 27వ తేదీతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. 


200 కేంద్రాల్లో ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండటం విశేషం. ఈ నెల 28వ తేదీన ఈ వేడుకను హైదరాబాద్ - శిల్పకళా వేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నానీని ఆహ్వానించినట్టుగా సమాచారం. అడిగిన వెంటనే నాని అంగీకరించాడట. ఇటు మహేశ్ అభిమానులకు .. అటు నాని ఫ్యాన్స్ కి ఈ నెల 28వ తేదీ పండుగ రోజేనన్నమాట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa