ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం జీ5 'వికటకవి' పేరుతో ఒక వెబ్ సిరీస్ కోసం నరేష్ అగస్త్యతో జతకట్టింది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల నవంబర్ 28 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ విడుదలైన 72 గంటలలో 50M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సిరీస్ లో గిరి, రఘు కుంచె, శిజు మీనన్, తారక్ పొన్నప కీలక పాత్రలలో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని రామ్ తాళ్లూరి నిర్మించారు.