విక్టరీ వెంకటేష్ రాబోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నామ్' సంక్రాంతి పండుగ సందర్భంగా 14 జనవరి 2025న అద్భుతమైన విడుదల కోసం రేసులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ఫస్ట్ సింగల్ గోదారి గట్టు సాంగ్ ప్రోమోను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. రమణ గోగుల ఈ పాటను పాడారు. తన వాయిస్‌తో మిడాస్ టచ్ తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. అతను తనదైన ప్రత్యేక శైలిలో పాటను పాడాడు మరియు భీమ్స్ సిసిరోలియో ఫుట్‌టాపింగ్ రొమాంటిక్ బీట్‌ను ట్యూన్ చేశాడు. ఈ పాట యొక్క సాహిత్యాన్ని భాస్కరభట్ల వినోదాత్మకంగా రాశారు. వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా మూవీ మేకర్స్ పూర్తి పాటని రేపు అంటే 3 డిసెంబర్ 2024న ఉదయం 11:07 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa