బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ బర్త్ డే సందర్భంగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నా క్రేజీ.. ఇన్సేన్లీ ఫన్నీ & అమేజింగ్ అర్జున్ కపూర్ కు హ్యాపీ బర్త్ డే. ప్రేమ.. సంతోషం ఎప్పడూ ఉండాలి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఒక అందమైన బీచ్ లో ప్రేమ పక్షులలాగా ఒకరి చేతిలో ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఇద్దరూ ప్రేమ తన్మయత్వంలో.. ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. పైకి అధికారికంగా ‘మేము లవర్స్’ అంటూ చెప్పినా చెప్పకపోయినా ఈ రోజు ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేసినట్టే. ఎందుకంటే “నా క్రేజీ అర్జున్” అని ఊరికే అంటారా . ఈ ఫోటోకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోయింది. అర్జున్ కపూర్ కు బర్త్ డే విషెస్ చెప్తూనే పనిలో పనిగా ఈ జంటకు కూడా అభినందనలు తెలిపారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో సెటైర్లతో చంపేశారు. ఒకరు “హ్యాప్తీ బర్త్ డే మలైకా అర్జున్” అన్నారు. మరొక నెటిజన్ ఇన్‌స్టా ఐడీ ‘బోనీ కపూర్ అఫిషియల్’.. ఈ ఐడీతో “సత్యానాష్..గయా కామ్ సే మేరె బేటా” అన్నారు. ఇంకొకరు “మున్ని బద్నామ్ హుయి డార్లింగ్ అర్జున్ కేలియే” అన్నారు. మరొకరు “మేరె సాత్ మా హై” అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa