హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకమైనదన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాము సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను, దర్శకుడు సుకుమార్ సహా సినిమా టీం అంతా షాక్‌కు గురయ్యామన్నారు. మొన్న తాము సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను, దర్శకుడు సుకుమార్ సహా సినిమా టీం అంతా షాక్‌కు గురయ్యామన్నారు.
మొదట రేవతి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని చెబుతున్నామన్నారు. ఎంత మాట్లాడినా... వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటాన్నారు. తనవంతుగా రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. మీకు నేను ఉన్నాను... నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నానన్నారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయమన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు.