ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప‌-2 గంగో రేణుక తల్లి లిరికల్ సాంగ్ అవుట్ నౌ....

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 10:57 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్‌’ . పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన‌ ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ర‌ష్మిక మందన్నా క‌థానాయిక‌గా న‌టించింది. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు వ‌రల్డ్ వైడ్‌గా మూవీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్రీమియ‌ర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ మూవీ నుంచి తాజాగా ‘గంగో రేణుక తల్లి’ జాత‌ర ఆడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాల‌కు పైగా ఉన్న ఈ సీన్ బ‌న్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్ర‌బోస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌గా.. మ‌హాలింగం పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ యు ట్యూబ్ లో వైరల్ అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com