బిహార్‌కు చెందిన మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సూపర్ 30’. ఈ చిత్రానికి వికాశ్ భల్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఇప్పటికీ షూటింగ్ తో పాటు అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యం లో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కాగా, హృతిక్ రోషన్ ట్విటర్ వేదికగా పంచుకున్న ఓ ఫొటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అందులో ఆయన అప్పడాలు అమ్ముతూ కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa